BC Financial aid | హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘బీసీలకు లక్ష ఆర్థిక సాయం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వృత్తిదారుల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కోసం ఈ నెల 6 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు.
వీట్లిలో3.80 లక్షల మంది పురుషులు దరఖాస్తు చేసుకోగా, 1.48 లక్షల మంది మహిళలు దరఖాస్తులు చేసుకొన్నారు. అత్యధికంగా రజక సామాజికవర్గం నుంచి1.18 లక్షల దరఖాస్తులు రాగా, వడ్డెర 56 వేలు, కుమ్మరి 52 వేలు, నాయీబ్రాహ్మణ 45,500, వడ్రంగి నుంచి 43 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు 26వరకు అర్హుల గుర్తింపు ప్రక్రియను చేపడుతారు. ప్రతినెలా 15న లబ్ధిదారులకు రూ.లక్ష సాయాన్ని అందిస్తారు.