హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్య యాంటీ నార్కొటిక్ వింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది.
రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. రాచకొండ సీపీ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలను డీజీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Srinivas Reddy is the new commissioner of Police Hyderabad. Avinash Mohanty is the new CP of Cyberabad. Sudheer Babu is new CP of Rachakonda. pic.twitter.com/mBnpodnWfs
— Srinivas Reddy K (@KSriniReddy) December 12, 2023