హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీతో ప్రాజెక్టుపై చర్చించేందుకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు.