Liquor Price | తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్! రాష్ట్రంలో లిక్కర్ ధరలను భారీగా పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం బ్రాండ్స్ రూ.100 వరకు పెరగనున్నాయి. హైఎండ్ కేటగిరీ బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. మద్యం ధరల పెంపుతో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇటు సర్కారుతో పాటు అటు కంపెనీలకు అదనపు ఆదాయం వచ్చేలా ధరలను నిర్ణయించాలని ఆలోచిస్తోంది. దీనికోసం కమిటీకి ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
ప్రతి నెలా రూ.250 కోట్లు, ఏడాదికి సుమారు రూ.3వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరేలా ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.