CM KCR | రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు.. ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్
తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. బుధవారం రవీంద్రభారతిలో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ, ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు సంప్రదాయ నాదస్వరంతో ప్రారంభమవుతాయి.
- ప్రముఖులకు పురస్కారాలు
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. బుధవారం రవీంద్రభారతిలో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ, ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు సంప్రదాయ నాదస్వరంతో ప్రారంభమవుతాయి. అనంతరం ముఖ్యఅతిథికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ప్రార్థనాగీతం, వేదాశీర్వచనం, పంచాంగ పఠనం, వేదపండితులు, అర్చకులు, ఆధ్యాత్మికవేత్తలకు సత్కారం తదితర కార్యక్రమాలుంటాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ‘ప్రతాపరుద్ర వైభవం’ పేరుతో కాకతీయుల కాలంనాటి పద్య కవితాగోష్టి-సాహిత్య రూపకం (భువన విజయం మాదిరిగా), సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకల్లో నలుగురు ఆధ్యాత్మికవేత్తలు, ఐదుగురు నాదస్వర విద్వాంసులు, 20 మంది అర్చకులు, ఆరుగురు వేద పారాయణ పండితులను ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నారు.
ఉగాది పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులు
పండితులు: ఎం విశ్వనాథస్వామి (వీరశైవ ఆగమ పండితులు), వేలేటి రామచంద్రరావు (ఆధ్యాత్మిక వేత్త), సీహెచ్ క్రాంతికిరణ్ శర్మ (జ్యోతిష్యులు), చక్రవర్తుల తేజ ఆచార్య, ఆర్మూర్ (వేద ఆగమ పండితులు).
వేద పారాయణులు: వై రామకృష్ణ శర్మ-సికింద్రాబాద్ (చండీ పారాయణం), గిరీశ్ వెంకట్రావు కులకర్ణి-చిక్కడపల్లి, హైదరాబాద్, బైకుంట పాండ-కాళేశ్వరం, అన్నవరపు ఆంజనేయ శర్మ-వేములవాడ, పాలెపు ప్రవీణ్ కుమార్-ధర్మపురి (యజుర్వేదం), అరుణ భట్ (శంకరమఠం, నల్లకుంట, హైదరాబాద్).
సంగీత విద్వాంసులు: ఎం శ్రీనివాస్-దండేపల్లి, మంచిర్యాల జిల్లా (సన్నాయి), మున్నంగి నాగేశ్వరరావు-భద్రాచలం, టీవై ఎల్మంద-వేములవాడ (డోలు), ఎల్ కేశన్న (భద్రాచలం), ఎం చిదంబరం-నాచారం గుట్ట, సిద్దిపేట జిల్లా (నాదస్వరం).
అర్చకులు: వీ మురశీధర శర్మ (శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్), ఈ కాశీనాథ శర్మ (ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్), రవీంద్రాచార్యులు (సనత్‌నగర్, హైదరాబాద్), గోవర్ధనం భట్టాచార్య, జీ సాత్విక్ శర్మ (లోయర్ ట్యాంక్‌బండ్, హైదరాబాద్), మధుసూదనాచార్యలు (నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా), అగ్నిహోత్రం చంద్రశేఖర్ (సరూర్‌నగర్, హైదరాబాద్), ప్రహ్లాదశర్మ (దిల్సుఖ్నగర్, హైదరాబాద్), సత్యనారాయణ శర్మ (యాదగిరిగుట్ట), వీ వీరభద్రరావు (సూర్యాపేట), రావికోటి పార్థివ శర్మ (పాపన్నపేట, మెదక్ జిల్లా), కే రామాచారి (వర్గల్, సిద్దిపేట జిల్లా), ఎం శివనాగులు (బొంతపల్లి, మెదక్), ఐ మధుకర్ శర్మ (ఐనవోలు), లంక శివకుమార్ (వరంగల్), కొమల్లపల్లి హరీశ్ శర్మ (రామప్ప, ములుగు), అప్పాల భీమశంకర్ (వేములవాడ), చంద్రగిరి శరత్ (వేములవాడ), చిలకముక్కు రమణయ్య (ధర్మపురి), గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు (గోదావరిఖని).
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

