హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
గురువారం ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో నిర్వహించబోయే ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను హాజరై.. అభిప్రాయాలను చెప్పాలని కోరింది.