హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): 317జీవో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో స్థానికతకు అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాజ్‌లను సవరించాల్సి ఉందని అడ్వకేట్ జనరల్, న్యాయవిభాగం అధికారులు వెల్లడించారు. 317 జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మ న్, మంత్రి దామోదర రాజనర్సింహ అ ధ్యక్షతన సచివాలయంలో సోమవారం భేటీ జరిగింది. కమిటీ సభ్యులు, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, న్యాయనిపుణులు సుదీర్ఘంగా చర్చించారు.
అయితే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్థానికత అంశానికి అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాజ్‌లను సవరించడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అడ్వకేట్ జనరల్, లా డిపార్ట్మెంట్ అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదించారు. అనంతరం న్యాయ వివాదాలు లేకుండా 317జీవోలో ఉద్యోగుల కేటాయింపు జరగాలని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. సమావేశంలో రాష్ట్ర జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్‌కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ వెంకటనరసింహారెడ్డి, పీఆర్సీ చైర్మన్ శివశంకర్, న్యాయశాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.