భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే : మంత్రి కేటీఆర్
Minister KTR | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మహీంద్రా, ఒలెకార్ట, జెడ్ఎఫ్, మైస్ట్రాహ్, గ్రావ్టాన్, హ్యూడాయ్ మొబిస్, వన్ మోటో, ప్యూర్ ఈవీ వంటి ప్రముఖ కంపెనీలకు తెలంగాణ ఇప్పటికే నిలయంగా మారిందని మంత్రి వెల్లడించారు. ప్రొగ్రెసివ్ ఈవీ అడాప్షన్ పాలసీ, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా సామార్థ్యంతో దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్’ స్టేట్‌గా తెలంగాణ అవతరించబోతుందని కేటీఆర్ వివరించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బుధవారం హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్‌లో భాగంగా మొదటి ఎడిషన్ ‘ఈవీ మోటార్’ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ప్రతిష్టాత్మక ఈవీ మోటార్ షోలలో హైదరాబాద్ ఈ-మోటార్ షో ఒకటని.. ఈ ప్రదర్శనను ప్రారంభించడం గర్వంగా ఉందని చెప్పారు. సుస్థిర భవిష్యత్తును సృష్టించడంపై తెలంగాణ దృష్టి పెట్టిందనడానికి ఇది నిదర్శనమన్నారు. సుస్థిరతను, క్లీన్ ఎనర్జీని అవలంభించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. ఈవీ రంగానికి ప్రోత్సాహాన్ని అందించడానికి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు. నీళ్లు, నాణ్యమైన విద్యుత్, సామాజిక మౌళిక వసతులు, జీవన నాణ్యతన మెరుగుపరచడం, తలసరి ఆదాయం పెంపు, సోషల్ స్టాండర్డ్స్, అంకితభావం కలిగిన ఉద్యోగులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. కంపెనీలకు అవసరమయ్యే అత్యవసర సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ మోడళ్లను ఆవిష్కరించడానికి హైదరాబాద్ ఈ-మోటార్ షో మార్గదర్శిగా నిలుస్తుందని కేటీఆర్ చెప్పారు.
ఈవీ వాహనాల ఆవిష్కరణ..
ఈ మోటార్ షోలో సిట్రాని ఎలెక్ట్రిక్ కార్, క్వాంటమ్ ఈవీ బైక్, హాప్ ఈ బైక్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఆ వాహనాలతో ఫొటోలకు పోజులివ్వడంతో కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిర్వాహకులు, సందర్శకులు కేరింతలు పెట్టి జై కేటీఆర్ నినాదాలు చేశారు. టూ వీలర్‌పై కూర్చొని విజయ సంకేతం చూపి.. భవిష్యత్తంతా ఈవీలదేనని తయారీదారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సదరు వాహనాల మేనేజ్మెంట్ను ప్రశంసించారు.
On the occasion, the Minister for Industries unveiled @CitroenIndia‘s eC3 all electric car, @electrichop‘s OXO, @Quantumev_India‘s Plasma vehicles.#HyderabadEMotorShow2023#emobilityweek2023 pic.twitter.com/DbGquC9xNZ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 8, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

