జైపూర్ : విజయ్ హజారే వన్డే టోర్నీలో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 26.2 ఓవర్లలో 215 స్కోరుకు ఆలౌటైంది.
సర్ఫరాజ్‌ఖాన్ (20 బంతుల్లో 62, 7ఫోర్లు, 5సిక్స్‌లు) రికార్డు అర్ధసెంచరీ చేసినా గుర్నుర్ (4/57) ధాటికి ముంబై ఓటమి ఎదుర్కొవాల్సి వచ్చింది. అంతకుముందు రమణ్‌దీప్ (72), అన్మోల్ప్రీత్(57) అర్ధసెంచరీలతో పంజాబ్ 45.1 ఓవర్లలో 216 పరుగులు చేసింది.