హైదరాబాద్, ఆట ప్రతినిధి : తియాన్జిన్(చైనా) వేదికగా ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీకి తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గందె ఎంపికైంది.
మహిళల 60మీటర్ల విభాగంలో నిత్య భారత్ తరఫున పోటీపడనుంది. నిత్యతో పాటు అభినయ రాజరాజన్ బరిలో ఉంది. ఇదిలా ఉంటే భారత్ నుంచి తజిందర్పాల్సింగ్, తేజస్విన్ శంకర్ కూడా పోటీపడుతున్నారు.