మైనర్ షూటర్‌పై లైంగికదాడి.. జాతీయ కోచ్‌పై వేటు
మైనర్ షూటర్‌పై లైంగికదాడికి యత్నించాడనే ఆరోపణలతో భారత షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై వేటు పడింది. మొహాలీకి చెందిన 17 ఏండ్ల షూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్‌లో అంకుశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ధృవీకరించింది.
ఢిల్లీ: మైనర్ షూటర్‌పై లైంగికదాడికి యత్నించాడనే ఆరోపణలతో భారత షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై వేటు పడింది. మొహాలీకి చెందిన 17 ఏండ్ల షూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్‌లో అంకుశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ధృవీకరించింది. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. నిరుడు ఆగస్టు నుంచి అంకుశ్ వద్ద శిక్షణ పొందుతున్న బాధిత షూటర్‌ను గత నెలలో నేషనల్ చాంపియన్‌షిప్స్ అని పిలిపించిన అతడు ఆమెపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఆమె ఆటతీరును అంచనా వేయాలని పిలిచిన అంకుశ్.. మైనర్‌ను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెప్తే ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడు. అయితే బాధితురాలు తన తల్లిదండ్రులతో విషయం చెప్పగా వాళ్లు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదుచేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేదాకా అంకుశ్‌పై వేటు వేస్తున్నట్టు ఎన్ఆర్ఏఐ తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

