తెలంగాణచౌక్, నవంబర్ 16: గ్రామ పంచాయతీల్లో 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు క రుణాకర్, జగన్మోహన్గౌడ్, అంజ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లో మీడియాతో మా ట్లాడారు.
ఐదేండ్ల క్రితం గ్రామాల్లో ని ర్మించిన రోడ్లు, వైకుంఠధామాలు, క్రీడా మైదానాలు, ట్యాంకులకు సంబంధించి ఎంబీ రికార్డులను అధికారులకు అందించినా ఇప్పటివరకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నదని మం డిపడ్డారు. 20లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సీఎం రేవంత్రెడ్డి వేములవాడ పర్యటనను 1200 మంది మాజీ సర్పంచులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.