హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. రాష్ర్టావతరణ వేడుకలకు మాజీ మం త్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మహముద్ అలీ, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధు లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తు న హాజరుకానున్నారు.
అనంతరం కాళేళ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాట్లను పూర్తిచేశారు. బీఆర్ఎస్ జిల్లా, నియోజకవర్గ కార్యాలయాలతోపాటు పట్టణాలు, మండల కార్యాలయాలు, గ్రా మా ల్లో నాయకులు, కార్యకర్తలు జాతీయ జెం డాను, పార్టీ జెండాను ఎగురవేసి, పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోనున్నారు.