హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇందులో జూనియర్ లెక్చరర్ పోస్టులు 1392 కాగా, డిగ్రీ లెక్చరర్ పోస్టులు 491 ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో అత్యధిక ఖాళీలు.. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ విభాగంలో ఉన్నాయి. డీఎల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ త్వరలోనే విడుదల చేయనుంది.
ఇంగ్లీష్ – 23
తెలుగు – 27
ఉర్దూ – 2
సంస్కృతం – 5
స్టాటిస్టిక్స్ – 23
మైక్రోబయాలజీ – 5
బయో టెక్నాలజీ – 9
ఐప్లెడ్ న్యూట్రిషన్ – 5
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ – 311
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – 39
కామర్స్ – బిజినెస్ అనలైటిక్స్(స్పెషలైజేషన్) – 8
డెయిరీ సైన్స్ – 8
క్రాప్ ప్రొడక్షన్ – 4
డాటా సైన్స్ – 12
ఫిషరీష్ – 3
కామర్స్ – ఫారెన్ ట్రేడ్(స్పెషలైజేషన్) -1
కామర్స్ – టాక్సేషన్(స్పెషలైజేషన్) -6