హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ నేతలు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
సీపీఎస్ రద్దు చేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని, జీవో-317 బాధితులకు సూపర్‌న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని, ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ను అమలుచేయాలని తదితర 55 డిమాండ్లను మంత్రి ముందుంచారు. వినతిపత్రం అందజేసిన వారిలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌రావు, ముజీబ్ హుస్సేని, ఎనుగుల సత్యనారాయణ, వీ రవీందర్‌రెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (టీజీఈసీడబ్ల్యూఏ) నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీసీ రెడ్డి తెలిపారు. ఎర్రగడ్డ సుందర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించే సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరుగనున్నట్టు చెప్పారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు.