లక్ష మంది దండుకట్టండి
‘జబ్బకు సంచి.. చేతిలో జేఏసీ జెండా తో లక్ష మంది ఉద్యోగ, పెన్షనర్లు హైదరాబాద్కు దండుకట్టండి’ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఈనెల 10న ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏ సీ వెల్లడించింది. దీనికి ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’గా నామకరణం చేసింది.
- ఈ నెల 10న ఉద్యోగుల హక్కుల సాధన సభ
- సామూహిక సెలవు పెట్టి హైదరాబాద్కు రావాలి
- తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కమిటీ పిలుపు
- సభ సన్నద్ధంపై టీఎన్జీవో భవన్లో సమాలోచనలు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘జబ్బకు సంచి.. చేతిలో జేఏసీ జెండా తో లక్ష మంది ఉద్యోగ, పెన్షనర్లు హైదరాబాద్కు దండుకట్టండి’ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఈనెల 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏ సీ వెల్లడించింది. దీనికి ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’గా నామకరణం చేసింది.
లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్లో కదంతొక్కుతామని జేఏసీ ప్రకటించింది. కుటుంబసభ్యులు, పిల్లలతో ఈ సభకు హాజరై ప్రభుత్వానికి నిరసన తెలుపుదామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. సచివాలయం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన జేఏసీ నేతలతో ‘చలో హైదరాబాద్’ విజయవంతంపై సమాలోచనలు జరిపారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఉద్యోగులంతా సామూహిక సెలవులు పెట్టి ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ఉద్యోగులను కలెక్టర్లు ఇబ్బందులు పెట్టొద్దని హితవు పలికారు.
మంత్రి లేకపోవడం విచారకం: మారం
ఉద్యోగులతో చర్చించేందుకు, తమ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేందుకు ప్రత్యేక మంత్రి లేకపోవడం బాధాకరమని జే ఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము మంత్రు ల వద్దకు వెళ్తే గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని, రేపు, ఎల్లుండి రండి అన్న సమాధానాలే ఎదురవుతున్నాయని తెలిపారు. సమావేశాలకు పిలిచి చాయ్, బిస్కట్ ఇచ్చి ఉత్త చేతులతో పంపుతున్నారే తప్ప పరిష్కారం చూపడంలేదని చెప్పారు.
మూడేండ్లు వేచిచూశాం: ఏలూరి
‘ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మూడేండ్లు వేచిచూశాం. ఇక ఓపిక పట్టలేము. ఇన్నేైండ్లెనా పరిష్కారం కాకపోవడంతోనే ఉద్యమానికి దిగుతున్నాం’ అని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ సభకు ఉద్యోగులను సన్నద్ధం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం మహబూబ్నగర్, నల్లగొండ, ఈ నెల 5న ఖమ్మం, వరంగల్, 7, మెదక్, నిజామాబాద్, 8న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అనుమతివ్వకుంటే కోర్టుకెళ్తాం: హుస్సేనీ
ఉద్యోగుల హక్కుల సాధన సభకు ప్రభుత్వం, పోలీస్శాఖ బేషరతుగా అనుమతినివ్వాలని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని (ముజీబ్) డిమాండ్ చేశారు. అనుమతిస్తే గౌరవంగా ఉంటుందని, లేకుంటే కోర్టుకెళ్తామని స్పష్టంచేశారు. తాము సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. తమ సమస్యలపై ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ కమిటీ సూచించిన పరిష్కార మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

