హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. జూలై మొదటి వారంలో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది. వెబ్ ఆప్షన్లు కూడా మొదటి వారంలోనే ప్రారంభమవుతాయి.
ఇప్పటి వరకు మూడు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు రాలేదు. ఈ కాలేజీలకు అనుమతులొస్తేనే ముందుకెళ్లే అవకాశముంటుంది. అధికారులు మాత్రం ఈ నెల 30లోపు అన్ని కాలేజీలకు అనుమతులొస్తాయని పేర్కొంటున్నారు.