TS DSC | తెలంగాణ డీఎస్సీ.. ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే (సీబీటీ) ఈ పరీక్షల తేదీలను ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొన్నది.
జిల్లాల వారీగా రోస్టర్..
అర్హతలు.. నిబంధనలు
- సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తిచేసినవారే అర్హులు. బీఎడ్ వారు పోటీపడే అవకాశంలేదు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (ఎస్ఏ) పోస్టులకు సంబంధిత మెథడ్‌లో బీఎడ్ పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్ పూర్తిచేసినవారు సైతం పోటీపడొచ్చు. - ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
- బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
- అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్ తేదీగా 1-7-23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏండ్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5, దివ్యాంగులకు 10 ఏండ్ల సడలింపు వర్తిస్తుంది.
- తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీ టెట్)లో క్వాలిఫై అయి ఉండాలి.
- గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.
- ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.
- గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు.
- అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.
- జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

