DGP Anjani Kumar | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని, ప్రజల భద్రత.. రక్షణ తమకు రెండు కండ్లు అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే రక్షకభటులుగా తమ బాధ్యతని, ప్రభుత్వమే తమకు బాస్.. సుప్రీం’ అని వెల్లడించా రు. శాంతిభద్రతలు సవ్యంగా ఉండటం వల్లనే ప్రపం చం నలుమూలల నుంచి పలు సంస్థలు ఇక్క డ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. నేరాలను అదుపుచేయడం, అడ్డుకోవడమే కాకుం డా.. సమాజానికి మెరుగైన రక్షణ వ్యవస్థను అందించడం కోసం ప్రతి పోలీస్ కర్తవ్య నిర్వహణకు కట్టుబడి ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్స్‌ను చాలెంజింగ్‌గా తీసుకుంటున్నాం. పకడ్బందీ వ్యవస్థ అమలుకు ‘సైబర్ యోధుల’ను తయారు చేస్తున్నాం. నిష్ణాతులైన 10 మంది సిబ్బందికి సైబర్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. త్వరలోనే వారంతా సైబర్ క్రైమ్స్ నియంత్రణకు ఆయా స్టేషన్ల పరిధిలో విధులు చేపడతారు. ఇప్పటికే ‘సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫామ్’ (సీఏపీ) పేరుతో వేల మం ది విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై శిక్షణ ఇ ప్పించాం. ‘తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెం టర్ (టీ4సీ) ద్వారా సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకునే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
అభివృద్ధికి కేరాఫ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణను మరింత స్వచ్ఛంగా ఉంచేందుకు ఎన్డీపీఎస్ కేసులపై ప్రధానంగా దృష్టిసారించాం. ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవారిపై ఫోకస్ పెట్టాం. ప్రత్యేకంగా నార్కొటిక్స్ బ్యూరో ను ఏర్పాటు చేశాం. మత్తుపదార్థాల విక్రేతలపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నాం. తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 17 జిల్లాలు ఉన్నాయి. వాటి పరిధిలో ప్రత్యేకంగా 50 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
పక్కాగా సాక్ష్యాలు, ఇతర ఆధారాలు సేకరించడంలో మా పోలీసులు సఫలీకృతమయ్యారు. ఏ కేసుకైనా కోర్టుకు కావల్సింది సాక్ష్యాధారాలు. అవి బలం గా ఉంటేనే కేసు నిలబడుతుంది. మన పోలీసులు అందించిన ఆధారాలకు తోడు.. ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు నేరస్థుడికి 20 ఏండ్లు జైలు శిక్షపడేలా చేశాయి. ఈ విషయంలో మా పోలీసులు, సంబంధిత డిపార్టమెంట్ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి ఈ ఘటన ఓ గుణపాఠం కావాలి.
ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సవ్యంగా ఉం టేనే అక్కడ వ్యాపారం, ఇతర వ్యవస్థలు బాగుంటాయి. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా తీర్చిద్దిందేదుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అంతఃకరణశుద్ధితో అమలు చేస్తున్నాం. వసతులు, శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. పెట్టుబడిదారులకు భద్రతాపరమైన రక్షణను కల్పించడం మా కర్తవ్యం. ఆ విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్నాం. అందుకే 50 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ నిర్దేశంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయి.
ప్రతి మనిషికి సెల్‌ఫోన్ కామన్ గ్యాడ్జెట్ అయిపోయింది. ఫోన్ పోగొట్టుకుంటే.. అతని సమాచారం మొత్తం పోగొట్టుకున్నట్టే. ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నాం. తెలంగాణలో ఈ విధానాన్ని ‘వరల్డ్ టెలికం, ఇన్ఫర్మేషన్ సొసైటీ డే’ని పురస్కరించుకొని మే 17న ప్రారంభిస్తున్నాం. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. స్మార్టఫోన్ పోయి నా, దొంగిలించినా దీని ద్వారా బ్లాకింగ్ చేసే సౌక ర్యం ఉంటుంది. దేశంలో ఎక్కడున్నా ఈ విధానం ద్వారా పోయిన ఫోన్‌ను వెతికి పట్టుకోవచ్చు. ఇందుకోసం www.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. మీరు ఫోన్ పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మీరిచ్చిన ఫిర్యాదును సీఈఐఆర్‌లో నమోదు చేస్తారు. ఈ కొత్త సాంకేతికత ద్వారా మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఉపయోగించి దేశంలో ఎక్కడున్నా ఫోన్‌ను కనిపెట్టవచ్చు. ఆ ఫోన్లో కొత్త సిమ్‌కార్డు వేసిన వెంటనే పోలీసులకు తెలిసిపోతుంది.
ఇది ఎన్నికల సంవత్సరం. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలోనే పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. రాజకీయ పక్షాలు, పార్టీల పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహిస్తాయి. అవి చిన్నవైనా, పెద్దవైనా ప్రజల రక్షణే మాకు ప్రథమం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కొత్త సవాళ్లను అధిగమించేందుకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను సమన్వయం చేసుకుంటూ సరికొత్త వ్యూహాలతో ముందుకువెళ్తాం. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు చెం దిన వామపక్ష తీవ్రవాదపార్టీల సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసారించాం.