Praja Palana | ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? మీకోసమే పోలీసుల హెచ్చరిక!
Praja Palana | మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? అభయ హస్తంలో ఆరు గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గ్యారంటీలకు ఎంపికయ్యారని మీకు రేపో.. ఎల్లుండో కాల్ రావచ్చు! మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పొచ్చు! రేషన్ కార్డు మంజూరయ్యిందని అనొచ్చు!
Praja Palana | మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? అభయ హస్తంలో ఆరు గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గ్యారంటీలకు ఎంపికయ్యారని మీకు రేపో.. ఎల్లుండో కాల్ రావచ్చు! మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పొచ్చు! రేషన్ కార్డు మంజూరయ్యిందని అనొచ్చు! 500కే గ్యాస్ కనెక్షన్ సాంక్షన్ అయ్యిందని కూడా చెప్పొచ్చు!! కానీ గుడ్డిగా నమ్మేయకండి! ప్రాసెస్ మొత్తం అయిపోయింది.. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఒక్క ఓటీపీ చెబితే చాలు.. ఈ ఆరు గ్యారంటీలు అమలు అయిపోతాయని చెబితే నమ్మి మోసపోకండి.! ప్రజాపాలన అప్లికేషన్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు తెలంగాణ ప్రజలను ప్రమాదంలో పడేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పడంతో చాలావరకు డేటా బయటకు లీకయ్యిందన్న వార్తలు నిన్నటి నుంచి వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ప్రజా పాలన లబ్ధిదారులకు సైబర్ పోలీసులు కీలక హెచ్చరిక చేశారు.
ఆరు గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దన్నారు. ఆరు గ్యారంటీలకు ఎంపికయ్యామని సంతోషంలో ఓటీపీ చెప్పి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని సూచించారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

