హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో గ్రూప్-2 విజేతలకు నియామకపత్రాలు ఇచ్చేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న నియామక పత్రాలు ఇచ్చేందుకు ముహూర్తం ఖరారుచేసింది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నియామకపత్రాలు అందజేస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఫార్మసీ కోర్సుల్లో సీట్లు పొందినవారు ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ఈ గడువు మంగళవారంతో ముగియగా, తాజాగా బుధవారం వరకు అవకాశం ఇచ్చారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో బీ ఫార్మసీ, ఫార్మా -డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో సీటు వచ్చినవారు బుధవారంలోగా ఫీజు చెల్లించాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ వెల్లడించారు.