హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తె లంగాణ): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలను ఈ నెల 14న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న 14 వేల మంది విద్యార్థులతో విద్యాదినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు.