హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): అమెజాన్ వెబ్ సిరీస్ తెలి వి తేటలున్న సీఎం రేవంత్ పెట్టుబడు లు తెచ్చారంటే నమ్మేదెలా? అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి మాటలు వింటే మే డిపండు గుర్తుకు వస్తున్నది. కనీసం ఆ పండులోపలైనా పురుగులు ఉంటా యి. కానీ ఆయన బుర్రలో ఏమీలేదనే విషయం అమెజాన్ వెబ్‌సిరీస్ మాటలతో తేటతెల్లమైంది’ అంటూ ఎద్దేవా చేశారు. దావోస్ పెట్టుబడుల ప్రకటనలన్నీ ఉత్త గాలిముచ్చట్లే అనే విషయం స్పష్టంగా అర్థమైందని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు.
‘అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను వెబ్ సిరీస్ అని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న ఆయన మాటలు వింటుంటూ పెట్టుబడులు దేవుడెరుగు రాష్ట్రం పరువు తీశారనే వి షయం బట్టబయలైందని మండిపడ్డా రు. ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారనే విషయం తెలియకుండా మా ట్లాడుతున్న వ్యక్తి సీఎం సీట్లో కూర్చున్నారంటే నవ్వొస్తుందని పేర్కొన్నారు. తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఫేక్ ఒప్పందాలతో అంతర్జాతీయంగా రాష్ట్ర పరువుతీశారని విమర్శించారు.