రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి ముస్తా బైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఈ భవనాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి బుధవారం వెల్లడించారు. విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్లతో భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర మంత్రి కే తారకరామారావు 2017 జూన్ 5న సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.