CM KCR | భారత ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతం, రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్దాస్ మోదీ. దామోదర్ దాస్ మోదీ- హిరాబెన్ దంపతుల కుమారుడు. ఆరుగురు సంతానంతో మోదీ మూడో సంతానం. ఆయన జన్మదినం సందర్భంగా కేంద్రమంత్రులు, పలు పార్టీల నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Kcr Letter