ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ తేజం ఇషా సింగ్‌కు కూడా భారీ నజరానా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్, షూటింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇషా సింగ్ ఇద్దరికీ చోరో రూ.2 కోట్లు నగదు బహుమతి ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
నగదుతోపాటు ఇద్దరికీ ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ లేదా, బంజారాహిల్స్‌లో ఈ స్థలం కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రీడాకారులు హైదరాబాద్ చేరుకున్న సమయంలో మంత్రులు, క్రీడాకారులు, అభిమానులు అంతా కలిసి వాళ్లకు ఘనస్వాగతం పలికిన సంగతి తెలిసిందే.