Telangana Cabinet | హైదరాబాద్ : రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై చివరిసారిగా జరిగిన కేబినెట్లోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టు గత కేబినెట్ సమావేశం సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.