Telangana Cabinet | హైదరాబాద్ : జనవరి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు హాజరు కానున్నారు.
కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ. 12000 ఆర్థిక సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన చర్చించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..