RS Praveen Kumar | రైతులనే దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ రాబందులు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
RS Praveen Kumar | అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నట్టేట ముంచుతుంది. మరి ముఖ్యంగా అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది రేవంత్ సర్కార్.
RS Praveen Kumar | హైదరాబాద్ : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నట్టేట ముంచుతుంది. మరి ముఖ్యంగా అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది రేవంత్ సర్కార్. రైతుబంధును ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వరి ధాన్యం తూకం విషయంలో రైతులను మోసం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ల వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేస్తూ దోపిడీకి తెరలేపారు. అన్నదాతకు జరుగుతున్న మోసాలపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేయకపోగా కాంగ్రెస్ రాబందులు ఉల్టా రైతులనే దోపిడీ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. జోగులాంబ జిల్లా ఐజ మండలంలో ఆర్డీఎస్ కెనాల్ కింద పండించిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. చాలా చోట్ల మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్ల అకౌంట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకొని ఇదే అదనుగా ఐకేపీ సెంటర్ల దగ్గర కాంగ్రెస్ నాయకులు రైతులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. క్వింటాల్‌కు నాలుగు కిలోల చొప్పున తక్కువ తూకం వేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఒక ఎకరం 30 క్వింటాలు దిగుబడి వస్తుంది.. కావున క్వింటాల్‌కి నాలుగు కిలోల చొప్పున తీసివేస్తే ఒక ఎకరం మీద రైతు రూ. 3500లు నష్టపోతున్నారు. మళ్లీ హమాలీ పేరిట క్వింటాల్ చొప్పున రూ. 46 వసూలు చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం సగటున ఒక ఎకరానికి ఐకేపీ సెంటర్ల ద్వారా గవర్నమెంట్‌కి విక్రయిస్తే రూ. 4880లు రైతులు నష్టపోతున్నామని ఇక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
కేసీఆర్ గవర్నమెంట్లో ఎకరాకు పెట్టుబడి సహాయంగా రూ. 5000 అందజేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉల్టా ఎకరాకు రూ. 4880 నష్టపోతున్నారు. మొత్తం రైతుల నుండి దోచుకున్న సొమ్ము ఎకరాకు దాదాపు పదివేల రూపాయలన్న మాట! ఇట్ల గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రైతులను ఇంకా ఎన్ని చోట్ల దోచుకుంటున్నారో ఈ కాంగ్రెసు కేడీలు! ఒక కన్నేసి ఉంచండి. రైతన్నలారా, తస్మాత్ జాగ్రత్త!! అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Peddapalli | కంప్యూటర్ ల్యాబ్‌లో కత్తి పోట్ల కలకలం..
Samruddhi Mahamarg | హైవేపై కూలిన ఐరన్ బోర్డు.. 50కిపైగా కార్లకు పంచర్.. భారీగా ట్రాఫిక్ జామ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

