ముంబై: మహారాష్ట్రలోని ముంబై-నాగ్పూర్ సమృద్ధి మహామార్గ్ (Samruddhi Mahamarg)పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మాలేగావ్, వనోజా టోల్ ప్లాజా మధ్య హైవేపై ఓ ఐరన్ బోర్డు విరిగిపడింది. దీంతో సుమారు 50కిపైగా ట్రక్కులు, కార్లు పంచర్ కావడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించకపోవడంతో అర్ధరాత్రి వరకు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
సమృద్ధి మహామార్గ్ను నాగ్పూర్-ముంబై మధ్య నిర్మిస్తున్నారు. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ కళల ప్రాజెక్టుగా పేర్కొంటారు. ఇప్పటికే ఈ ఎక్స్ప్రెస్ వేలో రెండు దశలు పూర్తయ్యాయి. దీంతో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే డిజైన్ లోపాలతో హైవేపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.