హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లకు సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయంతో పెద్ద అంబర్‌పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు ఇకపై జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి.