Katy Perry | ఆయనే నాకు సర్వస్వం.. ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నా : పాప్ సింగర్ కేటీ పెర్రీ
Katy Perry | అమెరికా (USA) కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీ (Katy Perry) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కెనడా (Canada) మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, ఆయనే తన జీవితానికి సర్వస్వం అని ఆమె ప్రకటించారు.
Katy Perry : అమెరికా (USA) కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీ (Katy Perry) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కెనడా (Canada) మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, ఆయనే తన జీవితానికి సర్వస్వం అని ఆమె ప్రకటించారు. ఇటీవల న్యూయార్క్ (New York) నగరంలో జరిగిన ‘కేటీ పెర్రీ : ది లైఫ్‌టైమ్స్ టూర్’ కాన్సర్ట్ ఫిల్మ్ ప్రీమియర్‌కు ఆమె జస్టిన్ ట్రూడోతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఇద్దరూ జంటగా రెడ్ కార్పెట్‌పై నడిచారు.
ఈ కార్యక్రమంలో కేటీ పెర్రీ మాట్లాడుతూ.. ‘నేను గాఢమైన ప్రేమలో ఉన్నా. నా జీవితానికి సర్వస్వం అయిన వ్యక్తిని కలిసిన తర్వాతే ఈ షో చేశా. ఆయన నా జీవితానికి ఒక లంగరులా నిలిచారు. నేను ఒక రంగుల గాలిపటం లాంటి దాన్ని, ఎంతో ఎత్తుకు ఎగురుతా. అలాంటి నాకు ఒక ఆధారం అవసరం. ఇప్పుడు ఆ ఆధారం దొరకడంతో నా జీవితం పరిపూర్ణంగా అనిపిస్తోంది’ అని ఆనందం వ్యక్తంచేశారు. తన జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
కేటీ పెర్రీకి గతంలో నటుడు రస్సెల్ బ్రాండ్‌తో వివాహం కాగా.. విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు ఓర్లాండో బ్లూమ్తో నిశ్చితార్థం జరిగి, కుమార్తె డైసీ జన్మించింది. అయితే 2025లో బ్లూమ్తో నిశ్చితార్థం రద్దు కావడం తన జీవితంలో అత్యంత కష్టమైన సమయాల్లో ఒకటని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘ఆ కష్టాల నుంచి బయటపడ్డా. అభిమానులకు, నా కుమార్తెకు, నాకు నేను ఇచ్చిన మాట కోసం నిలబడ్డాను. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సిందే’ అని కేటీ పెర్రీ అన్నారు.
ప్రస్తుతం తన 40 ఏళ్ల వయసులో జీవితాన్ని కొత్త కోణంలో చూస్తున్నానని, మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మారానని ఆమె పేర్కొన్నారు. కాగా గత కొన్నాళ్లుగా ట్రూడో, పెర్రీల ప్రేమాయణం వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరూ జంటగా అనేక ఈవెంట్లలో కనిపించడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా పెర్రీ చేసిన ప్రకటనతో వీరి ప్రేమ నిజమేనని నిర్ధారణ అయ్యింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

