హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో అసెంబ్లీ వ్యవహారా ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి రూ.2,75,891 కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించారు.
ఈ బడ్జెట్ నాలుగు నెలల కాలానికి అని, జూలైలో పూర్తిస్థాయి బ డ్జెట్‌ను ప్రవేశ పెడతామని మంత్రులు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కో ట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లుగా ప్రతిపాదించారు. ద్రవ్యలో టు రూ.32,557 కోట్లుగా, రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలకు అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించారు.