హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు శుక్రవారం కమిషన్ పూర్వ అధ్యక్షుడు, సభ్యులతో సమావేశమయ్యారు. బీసీ కులగణన, రిజర్వేషన్ అంశాలపై సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు తాము గతంలో సేకరించిన సమాచారాన్ని సమావేశంలో వ్యక్తపరచి ప్రస్తుత కమిషన్‌కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తరుచూ సమావేశమై పరస్పర చర్చలు జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమావేశంలో చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మితోపాటు పూర్వ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు డాక్టర్ ఆంజనేయగౌడ్, జూలూరి గౌరీశంకర్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.