దేవరుప్పుల (జనగామ) : సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, అభివృద్ధికి నోచుకోలేక పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. సీఎం కేసీఆర్(Chief Minister KCR) నేతృత్వంలో తెలంగాణ పల్లెలు అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించాయని వెల్లడించారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం,చిన్న మడూరు,పెద్ద మడూరు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో మొదలైన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి ఇంటికి, కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని పేర్కొన్నారు.
ఆసరా పింఛన్ల(Asara Pensions)తో వృద్ధులు ఎవరిపై ఆశ పడకుండా బతుకుతున్నారని తెలిపారు. రైతులకు రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ ద్వారా పంట దిగుబడి పెరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్న పెద్ద మడూర్ గ్రామస్తుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.