Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేత రాంరెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది.
మరోవైపు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్లు ముట్టడిస్తారనే సమాచారంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అలాగే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.