నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్రశ్నోత్తరాలను చేపడుతారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. దీంతోపాటు ఇవాళ అసెంబ్లీకి కాగ్ నివేదిక సమర్పించనుంది.
ఇక శాసనసమండలిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్లు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితిని 61 సంవత్సరాలకు పెంచే బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే ఈ సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం చర్చించనున్నది. ఉభయసభలు వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నాయి. ఆ తరువాత శాసనమండలి, శాసనసభ నిరవధికంగా వాయిదా పడనున్నాయి.
ఈనెల 15న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18న ఆర్థికమంత్రి హరీశ్ రావు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానిపై 21, 22 తేదీల్లో సాధారణ చర్చ జరిగింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో శాఖలవారీగా పద్దులపై చర్చించారు. మూడురోజుల చర్చలో మొత్తం 38 పద్దులను అసెంబ్లీ ఆమోదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Assembly
- budget
- Budget 2021
- CAG
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

