TSRTC Bill Pass | తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ఇవాళ మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.