హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉభయ సభల్లో ప్రభుత్వం రూ.3,04,965కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇరుసభల్లో బడ్జెట్ ప్రసంగాలు ముగిసిన తర్వాత సభ్యులు మంత్రులకు అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభలను శుక్రవారానికి వాయిదా వేశారు.