హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాలు శనివారం నిరవధికంగా వాయిదాపడ్డా యి. ఈ నెల 9న ప్రారంభమైన శీతాకా ల సమావేశాలు 7 రోజుల్లో 37 గంటల 44 నిమిషాల పాటు కొనసాగాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించగా, 4 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగా యి. సభ్యుల నుంచి వచ్చిన 306 ప్రశ్న ల్లో, 259ప్రశ్నలు ఆమోదం పొందా యి. అందులో 71ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు ఇవ్వగా మిగిలిన ప్రశ్నలకు జవాబులను సభ్యులకు పంపుతామని స్పీకర్ ప్రకటించారు. సమావేశాల్లో 71 మంది సభ్యులు మాట్లాడగా 69 సప్లిమెంటరీలు అడిగారు. బీజేపీఎల్పీ నాయకుడు మహేశ్వర్రెడ్డి, ఆ పార్టీ సభ్యుడు పాయల్ శంకర్, సీపీఐఎల్పీ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
బిల్లులకు మండలి ఆమోదం
శాసనమండలిలో శనివారం మూ డు సవరణ బిల్లులు ఆమోదం పొందా యి. రాష్ట్రంలోని 80 గ్రామపంచాయతీలను పురపాలక సంస్థలుగా మారుస్తామన్న ప్రభుత్వం హామీ నేపథ్యంలో ఆ బిల్లులకు మండలి పచ్చజెండా ఊ పింది. ఈసీ ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 8 లో ని 140 పంచాయతీల సవరణకు వీలుపడేలా ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను మహానగరపాలకసంస్థలో విలీనం చేసేందుకు జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.