Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. శనివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ ప్రారంభమైన తొలి రోజు కొత్త సభ్యులు, ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇక మూడో రోజైన నేడు.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.