Drinking Water | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): వేసవి, కరువు పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఒక్కో ఐఏఎస్ అధికారికి ఉమ్మడి జిల్లా చొప్పున బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు పాటిల్ ప్రశాంత్ జీవన్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాలకు కృష్ణ ఆదిత్య, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు ఆర్వీ కర్ణన్, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సూ ర్యాపేటకు అనితా రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డికి ఏ శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరికి వీ విజేంద్ర, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌కు శృతి ఓజా, వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌కు బీ గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటకు భారతి హోలికెరి, ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలకు సురేంద్ర మోహన్‌ను నియమించారు. వీరు వెంటనే జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించాలని, తాగునీటి పరిస్థితులపై సమీక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.