కృష్ణా జలాలపై విచారణ పునఃప్రారంభం
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ పునఃప్రారంభమైంది.
- ఏపీ ప్రశ్నలకు దీటుగా జవాబిచ్చిన తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ పునఃప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సాగిన ఈ విచారణలో తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్, క్యారీ ఓవర్ స్టోరేజ్, నీటి వినియోగం తదితర అంశాలపై ఏపీ లేవనెత్తిన ప్రశ్నలకు చేతన్ పండిట్ దీటుగా బదులిచ్చారు. ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు చేసిన సూచనల్లో ఏ అంశాలను పరిశీలించారని ఏపీ న్యాయవాది ప్రశ్నించగా.. తాగు, సాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో క్యారీ ఓవర్ స్టోరేజీ లెవల్ను మెయింటెయిన్ చేసేందుకు వీలుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు జలాలను విడుదల చేసుకోవచ్చని తెలిపారు. ఈ విచారణకు ఇరు రాష్ట్రాల సీనియర్ ఇంజినీర్లు, సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Andhra Pradesh
- Answer
- krmb
- meeting
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

