హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వపు ఆనవాళ్లు చెరిపివేయడమే లక్ష్యమని ప్రకటించుకు న్న సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్లుగా అక్కసుతో కూడిన పాలననే సాగిస్తున్నారని ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని నిప్పులు చెరుగుతున్నారు. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రెండుగా విభజించి, తూర్పు భాగంతో ఏర్పాటు చేసిన కమిషనరేట్‌కు రాచకొండ కమిషనరేట్ అని పేరు పెట్టిం ది. 5,100 చదరపు కిలోమీటర్ల పరిధి, 50 ల క్షల జనాభాతో యాద్రాద్రి భువనగిరి జిల్లాలో ని రాచకొండ ప్రాంతం కూడా అందులో వచ్చే లా హద్దులు నిర్ణయించారు. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 78 పోలీస్స్టేషన్లు రాచకొండ కమిషనరేట్‌లో ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరే ట్ వికేంద్రీకరణతో, భౌగోళికపరమైన అనుకూలతలు, సేవల్లో సౌలభ్యంతో శాంతిభద్రత ల పరిరక్షణలో పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. కానీ తాజాగా ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ జీవో ఇచ్చింది. కమిషనరేట్ పేరును మల్కాజిగిరిగా మార్చుతున్నట్టు జీవోలో పేర్కొన్నది. భువనగిరి జిల్లాలోని రాచకొండ ప్రాంతం కలిగి ఉన్న ఒక జోన్ మొత్తాన్ని కమిషనరేట్ పరిధి నుంచి తొలగించింది. ఆ ప్రాంతాన్ని యాదాద్రి జిల్లా పరిధిలోకి చేర్చింది.
రాచకొండ పేరును తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణవాదులు, చరిత్రకారులు, రంగారెడ్డి జిల్లా వాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 14వ శతాబ్దంలో పద్మనాయక రాజులు, రేచర్ల అనపోతనాయకుడు రాచకొండ కోటను నిర్మించి, అక్కడ నుంచి తెలంగాణను పాలించినట్టు చెప్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఈ కోట సాహసయాత్రలకు, గొప్ప చారిత్రక వారసత్వం, సంస్కృతికి నిలయంగా నిలుస్తున్నదని, అలాంటి గొప్ప వైభవాన్ని ప్రస్తుత తరానికి గుర్తుచేస్తూ, భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా గత ప్రభుత్వం కమిషనరేట్‌కు పేరు పెట్టిందని వివరిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డి అక్కసుతోనే రాచకొండ పేరు తొలగించడం దారుణమని మండిపడుతున్నా రు. రాచకొండను పాలించిన రాజులు వెలమ సామాజికవర్గానికి చెందిన వాళ్లు కావడం వల్లే రేవంత్‌రెడ్డి ఇలాంటి చర్యలు చేపట్టారని విమర్శిస్తున్నారు.
రాచకొండ ఆనవాళ్లు లేకుండా చేయడానికి కుట్రలు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్, తన మామకు సోదరుడైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం విడ్డూరమని ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, విపక్షాల నేతలు మండిపడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను ముక్కలు చేసి, రంగారెడ్డి జిల్లా ఆనవాళ్లు కనిపించకుండా ప్యూచర్ సిటీ పేరుతో కమిషనరేట్ పరిధిని నిర్ణయించడమేంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కాకతీయుల వైభవాన్ని చాటిచెప్తూ, పద్మనాయక రాజుల పాలనను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు సమైక్య పాలకుల అడుగు జాడల్లోనే నడుస్తున్న కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి పాలనలో.. మళ్లీ తెలంగాణ చరిత్రను విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.