TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించనున్నది. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, ఫలితాలు విడుదల స్వల్పంగా ఆలస్యం కానున్నది. వాస్తవానికి మొదట ఒంటిగంటకు ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, సీఎం రేవంత్ విజయవాడ పర్యటనకు వెళ్లడంతో ఫలితాలు ప్రకటన కాస్త ఆలస్యం కానున్నది.
మరో వైపు జేపీఏ విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడింగ్స్ ఇవ్వనున్నారు. అలాగే, మార్కులు సైతం ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పది ఫలితాల కోసం ‘నమస్తే’ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఫలితాల కోసం ntnews.com వెబ్సైట్ (బ్లూ కలర్ లింక్‌పై)పై ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది.