టేక్మాల్, జూలై 5 : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేటకు చెందిన ఆటోడ్రైవర్ జక్కుల చిరంజీవికి బీఆర్ఎస్, కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం. అప్పటికే ఆయనకు ముగ్గురు సంతానం ఉండగా, నాలుగో సంతానంగా కూతురు జన్మించింది.
ఐదో సంతానంగా కొడుకు పుడితే కేసీఆర్ అని పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే అతడి భార్య చిత్ర మే 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కొడుకుకు కేసీఆర్ అని నామకరణం చేశారు. బర్త్ సర్టిఫికెట్ కోసం ఎల్లుపేట గ్రామపంచాయతీలో దరఖాస్తు చేయగా జక్కుల కేసీఆర్ పేరుతో శనివారం బర్త్ సర్టిఫికెట్ను అధికారులు అందజేశారు.