ఆదిలాబాద్ : పాసు బుక్కుల్లో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘట ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్‌కు చెందిన యతేంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసుబుక్కుల్లో సవరణల కోసం తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు.
తహసీల్దార్, ఆర్ఐ
అందుకుగాను అధికారులు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావు మావల తాసిల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.