ప్రతి నెలా 9వేల ైైస్టెపెండ్
పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెంచడంలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ కీలక ముందడుగేసింది. ఒకవైపు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, మరోవైపు కోర్సుల సిలబస్ మార్చడం.
- పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రోత్సాహం
- ఐదు కోర్సులను ప్రవేశపెట్టిన సాంకేతిక విద్యాశాఖ అధికారులు
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెంచడంలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ కీలక ముందడుగేసింది. ఒకవైపు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, మరోవైపు కోర్సుల సిలబస్ మార్చడం. ఇంకోవైపు ఇంటర్న్‌షిప్/అప్రెంటిష్‌షిప్, ప్లేస్‌మెంట్స్ కల్పించడమనే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. పాలిటెక్నిక్ ఇంటర్న్‌షిప్/అప్రెంటిష్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు నెలకు రూ.9వేల ైస్టెపెండ్ అందించనున్నది. దీంట్లో నేషనల్ అప్రెంటిష్‌షిప్ ట్రై నింగ్ స్కీమ్(నాట్స్) రూ. 7వేలు అందించనుండగా, ప్రభుత్వం రూ. 2 వేలు ైస్టెపెండ్ అందజేయనున్నది.
డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులకు ఆరునెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రభుత్వమిచ్చే రూ. 2వేల ప్రోత్సాహం కోసం రూ. 30 కోట్ల కార్పస్‌ఫండ్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లోని సం స్థల్లో చేరిన వారికి అప్రెంటిష్‌షిప్ కల్పిస్తారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సౌకర్యం కల్పించే సంస్థలు 358 ఉన్నాయి. వీటిలో నాట్స్‌లో చేరినవి 184 పరిశ్రమలున్నా యి. 174 పరిశ్రమలు చేరనివి ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు.
ఈ కోర్సులను అఖిలభారత సాంకేతిక విద్యామండలి కూడా రూపొందించలేకపోయింది. ఇలాంటి ఐదు కోర్సులను మన అధికారులు రూపొందించి, ఏఐసీటీఈ అనుమతులు సాధించారు. డిప్లొమా ఇన్ సెమికండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, డిప్లొమా ఇన్ లాండ్స్కేప్ డిజైన్, డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టింది. సహజంగా ఏఐసీటీఈ తాను రూపొందించిన జాబితాలోని కోర్సులకు అనుమతి ఇస్తుంది. కానీ మన సాంకేతిక విద్యాశాఖ రూపొందించిన కోర్సులకు అనుమతి ఇవ్వడం ప్రత్యేకతం.
ఉజ్వల భవిష్యత్తుకు దారులు
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేందుకు సాంకేతిక విద్యలో సమూల మార్పులు చే శాం. పాలిటెక్నిక్‌లో పెను మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 80% సీట్లు నిండుతున్నాయి. 100% సీట్ల భర్తీని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏఐసీటీఈని ఒప్పించి, మెప్పించి ఐదు కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు కల్పించేందుకు పరిశ్రమ వర్గాలతో జూన్ 12న ఎంవోయూలు చేసుకోబోతున్నాం.
– శ్రీదేవసేన, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

