హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు మంగళవారం కేటాయించారు. తొలి విడతలో 65.5% సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు జైకొట్టారు. మొత్తం సీట్లలో ప్రభుత్వ కాలేజీల్లో 82% సీట్లు నిండగా, ప్రైవేట్ కాలేజీల్లో 50% సీట్లు నిండాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 10,012 సీట్లు భర్తీకాలేదు. 80,949 మంది క్వాలిఫై కాగా, 20,811 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.
సీట్లేమో 28,996 ఉన్నాయి. మొత్తం సీట్ల కంటే 8వేల మంది తక్కువగా వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నా మరో రెండు వేల మంది సీట్లు దక్కించుకోలేకపోయారు. సీట్లు పొందినవారు 18లోగా ఫీజు చెల్లించి, ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలి. లేదంటే సీటు కోల్పోయినట్టే. 31 నుంచి పాలిటెక్నిక్ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి.