దుమ్ముగూడెం, డిసెంబర్ 6 : ఓ విద్యార్థి పాఠశాలకు రాకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో కలిసి ఆ విద్యార్థి ఇంటి ఎదుట బైఠాయించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సింగవ రం పంచాయతీ పరిధి నిమ్మలగూడెంలో శనివారం చోటుచేసుకున్నది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి నాలుగోతరగతి చదువుతున్నాడు. అతడు వారం రోజులుగా గైర్హాజరు అవుతున్నాడు.
సదరు విద్యార్థిని పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరినా స్పందనలేదు. దీంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆ విద్యార్థి ఇంటికి చేరుకొని అక్కడే రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థిని పాఠశాలకు పం పించాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అయితే సోమవారం నుంచి తమ కుమారుడిని పాఠశాలకు పంపిస్తామని విద్యార్థి తండ్రి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.